టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న టైమ్ లో ‘ఆగస్ట్ 5’న రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ కాగా మరొకటి వైజయంతి నుంచి వచ్చిన ‘సీతారామం’. క్రైసిస్ ఉన్న సమయంలో, థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమవుతుంటే బింబిసార, సీతరామం సినిమాలు డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే ప్రేక్షకులు ఈ సినిమాలని ఎంతగా ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు. ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలకి బిగ్గెస్ట్ ఎస్సెట్ డైరెక్టర్స్. రిచ్ మేకింగ్ స్టాండర్డ్స్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ వర్క్ తోడైతే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో బింబిసార, సీతారామం సినిమాలని చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా కొత్త దర్శకుడు ‘వశిష్ట’ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని తీసుకోని… లిమిటెడ్ బడ్జట్ లో చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేశాడు. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి కాన్సెప్ట్ ని హండిల్ చేయడమే గొప్ప అంటే హిట్ కొట్టడం ఇంకా గొప్ప.
మొదటి సినిమాతోనే అంతటి హిట్ కొట్టిన వశిష్ట, తన సెకండ్ సినిమాని ఎవరితో చేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం వశిష్ట ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ తో డిస్కషన్స్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు సెట్ అయితే వశిష్ట నెక్స్ట్ సినిమా బాలకృష్ణ హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఉండే అవకాశం ఉంది. సీతారామం సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టిన హను రాఘవాపుడికి కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ హీరోలు లేరు. ఒక మంచి లవ్ స్టొరీని రాయడంలో దిట్ట అయిన హను రాఘవాపుడికి, అంతే మంచి యాక్టర్ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. మరి హను హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ అయ్యేలా చేసే ఆ హీరో ఎవరో చూడాలి. ఇప్పటికైతే ఒకేసారి హిట్ కొట్టిన ఈ ఇద్దరు దర్శకులు తమ నెక్స్ట్ సినిమాలని అనౌన్స్ చేయలేదు.