కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కంగువా వంటి బిగెస్ట్ డిజాస్టర్ తర్వాత వస్తున్నసినిమా కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : AAA : అల్లు అర్జున్ – అట్లీ.. సైలెంట్ గా.. గుట్టు చప్పుడు కాకుండా
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. అందుకు ఉదాహరణ రెట్రో అడ్వాన్స్ బుకింగ్స్. కేవలం 9 గంటల్లో 83.47K టికెట్స్ బుకింగ్స్ తో అదరగొట్టింది రెట్రో. ఒక్క బెంగుళూరులోనే 2300 పైగా టికెట్స్ బుకింగ్స్ తో సూపర్బ్ స్టార్ట్ అందుకుంది. ఇక తమిళనాడులో రూ. 2.8 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టి దూసుకెళ్తోంది. అలాగే ఈ సినిమా బుక్ మై షోలో ఏకంగా 200K కి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వింటేజ్ సూర్యను చూసేందుకు జనం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. కాగా సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక, సూర్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.