AAA : అల్లు అర్జున్ – అట్లీ.. సైలెంట్ గా.. గుట్టు చప్పుడు కాకుండా
అల్లు అర్జున్ గత చిత్రం పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది. పుష్ప 2. దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. యూనిట్ కు చెందిన అతి కొద్దీ మంది ముఖ్యుల సమక్షంలో అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయట. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలోను అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసాడని టాక్. అలాగే సినిమాకు స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, సమంత ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎవరిని ఇంకా అధికారకంగా ఫిక్స్ చేయలేదు. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read
తాజావార్తలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
-
SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!