NTRStatue:నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణపై హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్ .. 57 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే. మే 28 న ఈ విగ్రహావిష్కరణ ఉండనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కావడంతో.. హిందూ సంఘాలు, యాదవ సంఘాలు ఆ విగ్రహావిష్కరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ పోరాటంలో నటి కరాటే కళ్యాణి కీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ దేవుడు కాదని, ఆయన ఏ వర్గానికి దేవుడిగా భావించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను నిలిపివేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఏ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పును తెలిపింది.
Sarath Babu: శరత్ బాబు కోట్ల ఆస్తి వారికే.. వీలునామాలో ఏమి రాశారు..?
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విగ్రహం ఏర్పాటు చేయకూడదని, తదుపరి విచారణ జూన్ 6 కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇక విగ్రహ ఏర్పాటుకి అనుమతులు ఉన్నాయంటూ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ జీవోలను కోర్టుముందు ప్రవేశ పెట్టగా వాటిని కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో మే 28 న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ ఉండదని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆదేశాలపై నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై కీలక తీర్పు..#NTRStatue #Khammam #NTVnews #NTVTelugu pic.twitter.com/lmxJfNbw0W
— NTV Telugu (@NtvTeluguLive) May 25, 2023