Sarath Babu: శరత్ బాబు కోట్ల ఆస్తి వారికే.. వీలునామాలో ఏమి రాశారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarath Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మూడు రోజుల క్రితం మృతిచెందిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. శరత్ బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎన్నో మంచి సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాల రూపంలో నిత్యం మనతోనే ఉంటారు. ఇక శరత్ బాబుకు కోట్లకొద్దీ ఆస్తి ఆయన మరణాంతరం ఎవరికి చెందుతుందో అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శరత్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రమాప్రభ.. వారు ఎప్పుడో విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. ఇక రమాప్రభ తరువాత స్నేహలతను వివాహమాడిన శరత్ బాబు.. ఆమెతో కూడా విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేశారు. అప్పటినుంచి విడిగా ఉంటున్నారు. అయితే మూడో పెళ్లి కూడా చేసుకున్నారు అని టాక్ నడుస్తుంది కానీ నిజం ఎంత అనేది తెలియదు.
ఇకపోతే శరత్ బాబుది ఉమ్మడి కుటుంబం. 8 మంది అన్నదమ్ములు, 5 గురు అక్కచెల్లెళ్లు. ఈయన మూడోవాడు. ఇప్పటికీ కూడా వీరందరూ కలిసే ఉంటున్నారట. ఇక వీరి బాధ్యతలు మొత్తం శరత్ బాబునే చూసుకొనేవాడట. చెల్లెళ్ళ పెళ్లిళ్లు.. వారి కూతుళ్ళ పెళ్లిళ్లు కూడా ఆయనే దగ్గర ఉండి చేసేవారట. ఇక ఆయన మరణం తరువాత ఆయన ఆస్తి వీరిలో ఎవరికి చెందుతుంది అనే ప్రశ్నకు శరత్ బాబు సోదరుడు మధు స్పందించాడు. ఆస్తి పంపకాలు ఇంకా మొదలుకాలేదని, ఆయన దశదిన కర్మ జరిగాకా చూస్తామని చెప్పుకొచ్చాడు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
“మాడు ఉమ్మడి కుటుంబం.. ఆయన ఆస్తికోసం ఇక్కడ ఎవరు కొట్టుకోవడం లేదు. ముందు ఆయన దశదిన కర్మ చెస్ పనిలో ఉన్నాం.శరత్ బాబు గారి ఆస్తి ఏదైనా ఉంటే .. దాన్ని ఏం చేయాలి అనేది అప్పుడు ఆలోచిస్తాం. ఒకవేళ ఆయన వీలునామా రాసి పెట్టి ఉంటే.. అందులో ఎవరికి రాస్తే.. వారికే ఆ ఆస్తి దక్కుతుంది. ఆ లాకర్లు, డబ్బు వ్యవహారాలు అన్ని కూడా ఆయన దశదిన కర్మ తరువాతే చూస్తాం. ఆస్తి ఎవరికి ఇచ్చినా.. ఏంటి మాకివ్వలేదు అని కొట్టుకోము.. ఎందుకంటే .. మేము అందరం ఒక్కటే. మా మధ్య విబేధాలు ఏమి లేవు” అని మధు చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. శరత్ బాబ ఎప్పుడో తన వీలునామాను రాసిపెట్టి ఉంచారని, తన కుటుంబంలో ఉన్న 23 మందికి సరిసమానంగా ఆస్తిని పంచి పెట్టారని తెలుస్తోంది. మరి ఆ ఆస్తిలో మాజీ భార్యలకు ఏమైనా వాటా ఇచ్చాడేమో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?