‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నభ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో సో గా ఉండే హీరోయిన్స్ నే బ్యూటీఫుల్ గా చూపించే పూరి, నభా నటేష్ అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాలో నభా గ్లామర్ షోతో యూత్ ని ఫేవరేట్ హీరోయిన్ అయిపొయింది. యాక్టింగ్ అండ్ బ్యూటీ కలగలిసిన నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. అందరూ అనుకున్నట్లు గానే నభా నటేష్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలని చేసింది. రవితేజ లాంటి స్టార్ హీరోతో పాటు నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో కూడా నటించిన నభా నటేష్ 2021 నుంచి సినిమాల్లో కనిపించడం మానేసింది.
ఒక యాక్సిడెంట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన కారణంగా నభా నటేష్ సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న నభా నటేష్ తన కంబ్యాక్ కి రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే గ్లామర్ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ తన రీఎంట్రీని ప్లాన్ చేస్తున్న నభా నటేష్, లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈరోజు ఉదయమే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వారికి నభా నటేష్ ఫ్లోరల్ డిజైన్ డ్రెస్ లో పోస్ట్ చేసిన ఫోటోలు స్వీట్ షాక్ ఇచ్చి ఉంటాయి. క్లివేజ్, థైగ్స్, బ్యాక్ అందాలని చూపిస్తూ నభ పోస్ట్ చేసిన ఫొటోలకి లైక్స్, కామెంట్స్ తో ఫాన్స్ హంగామా చేస్తున్నారు. యాక్టింగ్ స్కిల్స్ ఉండి, స్కిన్ షోకి బౌండరీలు పెట్టుకోకుండా ఉంటుంది కాబట్టి నభా నటేష్ కి రీఎంట్రీ పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ కన్నడ నుంచే శ్రీలీలా లాంటి యంగ్ హీరోయిన్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు హీరోలు నభా నటేష్ ని ఎంతవరకూ ప్రిఫర్ చేస్తారు అనేది చూడాలి.
this Barbie has no chill ! pic.twitter.com/24ZFHQnnkP
— Nabha Natesh (@NabhaNatesh) August 3, 2023