Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ కుర్ర హీరో.. ఆ తరువాత ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక గతేడాది బిగ్ బాస్ లోకి భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించి బయటికి వచ్చాడు. ఇక బిగ్ బాస్ తరువాత వరుణ్ రీ ఎంట్రీ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇందువదన అనే బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసిమీద ఉన్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఆర్యన్ శుభాన్ SK దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ కు గాయాలు అయ్యినట్లు చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ తెలిపాడు.
Pawan Kalyan: ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో నా ఫ్యాన్స్ గొడవపడుతున్నారు.. కులం కోసం కొట్టుకోకండి
“నిన్న చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారు. దాంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అద్దాంతంగా వాయిదా వేయాల్సివచ్చింది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత మాట్లాడుతూ.. ” పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని 40% పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని” అన్నాడు. ఈ వార్త తెలియడంతో వరుణ్ సందేశ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.