Srikanth: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో అందరు శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారట. ఇక ఆ అందరి కలల రాకుమారుడును ఊహ .. తన ఊహల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా కట్టిపడేసింది. ఆమె సినిమాలో ఈ జంట కలిసి నటించారు. ఆ చిత్రం నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించి.. పెళ్లి వరకు దారితీసింది. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి రోషన్.. అందరికి తెలిసినవాడే. పెళ్లి సందడి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా రెండో అమ్మాయి మేధ. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ చిన్నది.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే అమ్మడి అందం కూడా హీరోయిన్ మాదిరిగానే ఉంది.
Trisha: రేయ్ .. రేయ్ .. ఎవడ్రా.. నువ్వు.. మా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యి వేశావ్
తల్లి అందం.. తండ్రి పోలికలు.. కలబోసి పుట్టినట్లు కనిపిస్తోంది. ఇక మూడో వాడు రోహాన్. ఈ ముగ్గురు పిల్లలు అచ్చుగుద్దినట్లు శ్రీకాంత్ లానే ఉండడం విశేషం. అందుకే ఈ ఫ్యామిలీ ఎక్కడ కనిపించినా శ్రీకాంత్ ను అన్నా.. మీ ఇంట్లో జిరాక్స్ మెషిన్ పెట్టావా అంటూ సరదాగా ఆటపట్టిస్తుంటారు నెటిజన్లు. ఇక తాజాగా ఈ కుటుంబం మొత్తం ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఇదుగో ఇలా మెరిశారు. తండ్రి కొడుకులు.. ఒకేలాంటి ఫైజామా తో కనిపించగా.. తల్లికూతుళ్లు చీరకట్టుతో మెప్పించారు. గ్లోడ్ రంగు చీరలో బంగారు బొమ్మల మెరిసిపోతుంది మేధ. ఇప్పుడు వచ్చే కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలబడే అందం అమ్మడిలో ఉందని చెప్పొచ్చు. మరి శ్రీకాంత్ తన కూతురిని టాలీవుడ్ కు పరిచయం చేస్తాడా..? లేదా..? అనేది చూడాలి. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.