Srikanth: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో అందరు శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారట.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే బాల నటుడిగానే కాకుండా యువ కథానాయకుడిగానూ ‘నిర్మలా కాన్వెంట్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్తంత గ్యాప్ తీసుకుని సెప్టెంబర్ మాసంలో ‘పెళ్ళి సందడి’తో మరోసారి హీరోగా సందడి చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… శ్రీకాంత్, ఊహ కుమార్తె మేథ సైతం త్వరలో పూర్తి స్థాయిలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోందట. గతంలో గుణశేఖర్ రూపొందించిన ‘రుద్రమదేవి’ చిత్రంలో బాలరుద్రమగా శ్రీకాంత్ కూతురు మేథ నటించింది. ఆ సినిమాలో రోషన్ చిన్నప్పటి రానా…
సినిమా ఇండస్ట్రీకి వారసులు పరిచయం కావడం అనేది సాధారణ విషయమే. అయితే టాలీవుడ్ లో అది వారసులకే పరిమితం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి చూపించరు. చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే హీరోయిన్లుగా సినిమా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ చూసే పద్ధతి గల పాత్రల్లోనే కన్పించారు. ఎందుకంటే స్టార్ హీరోల కూతుర్లు వెండితెరపై గ్లామర్ ఒలకబోయడం…