గత కొంతకాలంగా హీరో శ్రీ విష్ణు నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రాలేదు. పక్కింటి కుర్రాడి ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఎంతోకొంత విషయం ఉంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని యాక్షన్ బాట పట్టి కాస్త తప్పించిన శ్రీవిష్ణు ఈసారి మాత్రం నిలబెట్టుకున్నాడు. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు అంటే శ్రీవిష్ణు ‘సామజవరగమనా’ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ బయ్యర్స్ అందరికి లాభాలని తెచ్చిపెడుతుంది. సింపుల్ కథ, చక్కటి స్క్రీన్‌ప్లేతో రూపొందిన ‘సామజవరగమనా’ ఇటీవలే కాలంలో వచ్చిన క్లీన్ సినిమా. ఎలాంటి బూతు లేకుండా, ఫ్యామిలీ అంతా నవ్వుకునేలా, ఎమెషనల్ సీన్స్ కూడా కలిసి ఒక షడ్రుచుల సమ్మేళనంలా సినిమా చేసిన మేకర్స్ ఒక మంచి ఎంటర్టైనర్ అందించారు.
ఎదిగి ఉద్యోగం చేసుకుంటున్న ఒక కొడుకు తండ్రిని డిగ్రీ పరీక్ష పాస్ చేయించడం తిప్పలు పడే కొడుకుగా శ్రీవిష్ణు చాలా నేచురల్ గా నటించాడు. నిజానికి శ్రీవిష్ణు ఇలా నటించడం కొత్తేమి కాదు, అదే తన బలం కూడా. ఈ విషయాన్నీ మర్చిపోయి శ్రీవిష్ణు ప్రయోగాలు చేయడం మొదలు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఎట్టకేలకు తన బలాన్ని తెలుసుకున్న శ్రీవిష్ణు, సామజవరగమనా సినిమాలో కూడా ఎప్పటిలాగే చాలా ఈజ్ తో నటించి ఆకట్టుకున్నాడు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ అయితే ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయింది. కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అనుకునే పరిస్థితిలో శ్రీవిష్ణు చేసిన ఈ సినిమా అతనికి మచ్ నీడెడ్ హిట్ ఇచ్చింది. ఇకపై కూడా శ్రీవిష్ణు కథలు నమ్మి సినిమాలు చేస్తూ ఉంటే హిట్స్ వస్తూ ఉంటాయి లేదంటే మళ్లీ కష్టాలు తప్పవు.