టాలీవుడ్ సీనియర్ హీరో రాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘ఆనంద్’, ‘వెన్నెల’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో మంచి విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే రాజా సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. దివంగత కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆయన కాంగ్రెస్ లో చేరాడు. ఆ తరువాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మృతి చెందాక రాజకీయాలను వదిలేశారు. ప్రస్తుతం ఆయన క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని పాస్టర్ గా మతబోధన చేస్తున్నాడు.. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను అభిమానులతో పంచుకున్నారు. రాజకీయాలను వదిలేయడం, పాస్టర్ గా మారడం వీటి అన్నింటికి సమాధానాలు చెప్పాడు.
“వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చాను.. ఆయనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆయన మృతి చెందాకా అక్కడ ఉండాలనిపించలేదు. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాను.. ఇక కొన్ని ఘటనలు నాకు జీవితంపై విరక్తి తెచ్చాయి.. నేను ఎంతో నమ్మిన చాలామంది నన్ను మోసం చేశారు.. నా దగ్గర డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తికి రూ. 7 లక్షలు అవసరం ఉంటే ఇచ్చాను.. నేను డబ్బులు ఇచ్చిన మరుసటి రోజే అతడు పారిపోయాడు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా జరిగాయి. వీటివలనే నాకు జీవితంపై విరక్తి ఏర్పడింది . ఆ సమయంలోనే జీసెస్ సన్నిధి నాకు ప్రశాంతత ఇచ్చింది.. అక్కడే ఉంటూ ఆయన గురించి తెలుసుకున్నాను.. మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది. ప్రస్తుతం ఎంతో హ్యాపి గా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.