సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇన్ని రోజులు ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఘాన్గ్ జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28కి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఒక స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. మహేష్ నోట్లో బీడీతో ఫుల్ మాస్ గా కనిపించాడు. త్రివిక్రమ్ ఘట్టమనేని ఫాన్స్ కి ఈ మాస్ గ్లిమ్ప్స్ తో ఫుల్ మీల్స్ పెట్టేసాడు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, త్రివిక్రమ్ టేకింగ్ కి థమన్ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వచ్చిన పాట తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ లా వినిపిస్తోంది. ఈ సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? అని వెతకడం మొదలుపెట్టారు. గుంటూరు కారం బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లిరిక్స్…
సన్న కర్ర.. సవ్వా దెబ్బ..!
బొడ్డురాయి.. బేటా దెబ్బ..!
రవ్వల దెబ్బ.. దవడ అబ్బ.. ఉయ్ !!
సరా సరా శూలం.. సుర్రంటాంది కారం!
ఎడా పెడా చూడం.. ఇది ఎర్రెక్కించే బేరం!
సరా సరా శూలం.. సుర్రంటాంది కారం!
ఇనుప సువ్వ.. కౌకు దెబ్బ.. ఇరగదీసే రవ్వల దెబ్బ.. ఉయ్ !!
అంటూ ప్రాపర్ మాస్ లిరిక్స్ తో కంపోజ్ చేసిన సాంగ్, మహేష్ ఫాన్స్ కి పూనకాలు తెచ్చింది. సోషల్ మీడియాలో చూస్తేనే ఫాన్స్ ఈ రేంజ్ హై ఫీల్ అవుతున్నారు అంటే ఇక థియేటర్ లో కూర్చొని సినిమా చూసే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఈ సాంగ్ తో గుంటూరు కారం సినిమాపై అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. మరి అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా ఈసారి మహేష్-త్రివిక్రమ్ లు థియేటర్ హిట్ ఇస్తారేమో చూడాలి.