HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ నుంచి ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చింది. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వారందరికీ జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ. పైగా పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకు కన్నప్ప మూవీకి కేవలం 15 రోజుల గ్యాప్ ఉంది. అంటే రెండు వారాల్లోనే కన్నప్ప వస్తోంది. కానీ రెండు వారాల్లోనే వీరమల్లు హవా థియేటర్ల దగ్గర తగ్గుతుందా చెప్పలేం. ఒకవేళ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఆ వేవ్ మామూలుగా ఉండదు.
Read Also : Kannappa : ‘కన్నప్ప’ కామిక్ సిరీస్ నుంచి మరో వీడియో రిలీజ్..
అసలే పవన్ కల్యాణ్ ప్లాప్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్లు వస్తుంటాయి. ఇక హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. థియేటర్లు 20 రోజుల దాకా సందడిగానే ఉంటాయి. వీరమల్లు హవా ఎంత లేదన్నా 20 రోజుల దాకా ఉంటుంది. ఆ వేవ్ లో మంచు విష్ణు కన్నప్ప సినిమా వస్తే అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కష్టమే అవుతుంది. అసలే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడుతుందనే అంటున్నారు ట్రేండ్ పండితులు.
పవన్ కల్యాణ్ సినిమాకు పోటీగా రావొద్దనే ఉద్దేశంతో చాలా పెద్ద సినిమాలు వాయిదా వేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ కన్నప్ప ఆల్రెడీ వాయిదా పడి జూన్ 27కు వస్తోంది. కాబట్టి మరోసారి వాయిదా వేసే అవకాశమే లేదు. చావో రేవో రిలీజ్ చేయాల్సిందే. కన్నప్పకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప కలెక్షన్లు అనుకున్నంత వస్తాయనే నమ్మకం లేదు. మామూలు హిట్ టాక్ వస్తే వీరమల్లుతో పోటీ పడి లాభాలు తెచ్చుకోవడం అంటే కష్టమే అంటున్నారు. ఈ లెక్కన వీరమల్లు రూపంలో కన్నప్పకు భారీ దెబ్బ పడుతుందని అంటున్నారు.
అటు కుబేర పరిస్థితి కూడా అంతే. జూన్ 20న ఈ మూవీ వస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ధనుష్, నాగార్జున నటిస్తున్నారు. వీరమల్లు వచ్చిన 8 రోజులకే ఇది వస్తోంది. కానీ వీరమల్లుకు భారీ క్రేజ్ ఉంది. ఈ వేవ్ లో కుబేరకు దెబ్బ పడుతుందని అంటున్నారు. కుబేరకు తమిళంలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి కుబేర, కన్నప్ప సినిమాలు వీరమల్లు ధాటికి ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి.
Read Also : Bihar: ‘నా భర్త మృతదేహంతో అరగంట ఉండనివ్వండి’.. జవాన్ భార్య ఆవేదన!