Kannappa : మంచు విష్ణు నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి తరచూ అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా ప్రమోషన్లు చేస్తున్న మూవీ టీమ్.. కన్నప్ప కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మూవీ నుంచి కామిక్ సిరీస్ పేరుతో వీడియోలను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రెండు వీడియోలను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఫైనల్ వీడియోను వదిలింది. ఇందులో తిన్నడు మార్పును ప్రధానంగా హైలెట్ చేస్తూ చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో తిన్నడు ముందు ఎందుకు శివుడిని వ్యతిరేకించాడు అనేది చూపించారు.
Read Also : KondaSurekha: వివాదాస్పద వ్యాఖ్యలపై కొండా సురేఖ క్లారిటీ..
ఆ తర్వాత తిన్నడు శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు.. అందుకు ప్రధాన కారణాలు ఏంటి అనేది కాస్త హింట్ ఇచ్చారు. ఈ ఫైనల్ వీడియోను భక్తి, దైవత్వంతో నింపేశారు. ఈ కామిక్ వీడియోలను కార్టూన్ టైప్ లో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని పాత్రలను కూడా ఈ కార్టూన్ స్టైల్ లో చూపించేస్తున్నారు. కానీ ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ పాత్రలను బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ మూడో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీటీమ్ వరుసగా అప్డేట్లు ఇవ్వడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ట్రైలర్ పై అధికారిక ప్రకటన రాబోతోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడ్డ ఈ సినిమా.. ఈ సారి మాత్రం అన్ని పనులను ఫినిష్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.
Read Also : WAR 2 : రిటర్న్ గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా : జూనియర్ ఎన్టీఆర్