HHVM : హరిహర వీరమల్లు మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత ఏఎం రత్నం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఒక్క ఇంటర్వ్యూలో పాల్గొనలేదు. కానీ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి హైప్ పెంచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీ గురించి తన కాన్ఫిడెన్స్ బయట పెట్టారు. నేను ఎన్నో సినిమాలన నిర్మించాను. కానీ నా సినీ కెరీర్ లో ఎక్కువకాలం జర్నీ చేసింది మాత్రం ఈ సినిమాతోనే. ఈ మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్, సెట్స్ వాడేశాం. ఈ మూవీకి అవే అతిపెద్ద బలం. అందుకే ఇంత ఆలస్యం అయింది.
Read Also : Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయ జీవితంలో తీరని మచ్చగా మిగులుతుంది!
ఎన్నో సినిమాలు చేసిన నిర్మాతగా చెబుతున్నాను ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుద్ది. పవన్ కల్యాణ్ గారు లేకుంటే ఈ సినిమాకు ఒక అర్థం వచ్చేది కాదు. మా అబ్బాయి జ్యోతికృష్ణ మూవీని చారిత్రాత్మకతకు ముడిపెడుతూనే ఈ తరం వాళ్లకు నచ్చే విధంగా తీశాడు. మూవీ అద్భుతంగా వచ్చింది. పవన్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత ఏఎం రత్నం. ఈ సినిమా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్లలో విడుదల కాబోతుండటంతో మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
Read Also : Genelia : జెనీలియా రీఎంట్రీకి అసలైన కారణం ఇదే..!