పెళ్లయ్యాక చాలామంది హీరోయిన్లు కొంతకాలం గ్యాప్ తీసుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జెనీలియా మాత్రం చాలా ప్రత్యేకం గా వ్యవహరించింది. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఆమె బాలీవుడ్‌లో ‘సితారే జమీన్ పర్’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించింది. దానికి తోడు సౌత్‌లోనూ ‘జూనియర్’ అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇన్ని ఏళ్లకు ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Also Read : Rahul Sipligunj : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ గ్యాప్‌కి అసలైన కారణం నా కుటుంబమే. పెళ్లి తర్వాత భర్తకు టైమ్ ఇవ్వాలి. తర్వాత పిల్లలకు.. ఏ పని మొదలు పెట్టిన దాని పూర్తి చేయాలి. అందుకే ప్రజంట్ ఫ్యామిలీకి నా టైం స్పెండ్ చేశా. ఇప్పుడు నా పిల్లలు వారి పనులు వారు చేసుకో గలుగుతున్నారు. అందుకే ఇప్పుడు నేను నా సినీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మంచి మంచి పాత్రలో తో మీ ముందుకు వస్తా’ అని వెల్లడించింది.
అయితే ఈ గ్యాప్‌లో జెనీలియా గృహిణిగానే కాదు, వ్యాపారవేత్తగానూ, నిర్మాతగానూ ‘herself’ ను స్థిరపర్చుకుంది. ఒక ఫుడ్ కంపెనీను స్థాపించి విజయవంతంగా నడిపింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద వడం వల్ల తిరిగి సినిమాలపై దృష్టి పెడతానంటోంది. ప్రస్తుతం జూనియర్ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఇక నుంచి సినిమాలకు పూర్తి స్థాయి సమయం కేటాయిస్తానంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.