ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రం నుండి వినూత్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు జోంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జతో మొదటి భారతీయ సూపర్ హీరో “హను-మాన్” మూవీ చేయబోతున్నారు. అటువంటి సూపర్ హీరో సినిమాలు చేసేటప్పుడు దర్శకుడికి ప్రధాన సవాలు కథానాయకుడి మేకోవర్.
Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !
“హను-మాన్”లో తేజ మేకోవర్ కు ముందు దర్శకుడు చాలా పరిశోధన చేశాడట. ఈ చిత్రంలో తేజ హనుమంతు పాత్రలో కనిపించబోతున్నాడు. మేకర్స్ హనుమంతుడి ఫస్ట్ లుక్ ను, పరిచయ వీడియోను విడుదల చేశారు. తేజ ఆకర్షణీయమైన కేశాలంకరణ, మేకోవర్, విలక్షణమైన డ్రెస్సింగ్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇక వీడియోలో అంజనాద్రి ప్రపంచం విజువల్ ఫీస్ట్ లా అన్పిస్తోంది. దట్టమైన అడవి, జలపాతాలు, తేజ సజ్జ లుక్ అన్నీ హైప్‌ని పెంచుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చూస్తుంటే ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్టుగా అన్పిస్తోంది.