ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్యా వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వాన సినిమాతో తెలుగు వారికి దగ్గరైన వినయ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం గమనార్హం. దాదాపుగా 250 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి 300 కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది ఈ హనుమాన్. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి సినిమా రిలీజ్ అయి దాదాపు 15 రోజులు పూర్తి అవుతున్నా సరే సినిమా మీద ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
Also Read; The Indrani Mukerjea Story Buried Truth : మరో సంచలన డాక్యూమెంటరీతో వస్తున్న నెట్‌ఫ్లిక్స్..
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత ఆసక్తికరమైన సినిమా మరి ఏది రిలీజ్ రాకపోవడంతో ఇప్పటికీ ఈ సినిమాకి వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు జి5 సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలాగే హిందీ భాషలో సైతం జి5 యాప్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే అది అప్పుడే కాదు మార్చి రెండవ వారంలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సినిమా రిలీజ్ అయిన డేట్ నుంచి 60 రోజులు తర్వాత ఉంటుందని సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రమోషన్స్ లో వెల్లడించారు. అన్నమాట ప్రకారమే మార్చి రెండో వారంలో రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.