ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన డాక్యూమెంటరీలు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్’,’హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’, ‘కర్రీ అండ్ సైనైడ్ మరియు ‘ది హంట్ ఫర్ వీరప్పన్’వంటి ఇండియన్ క్రైమ్ డాక్యుమెంటరీలు రికార్డు వ్యూస్ సాధించాయి.ఇదిలావుంటే.. నెట్‌ఫ్లిక్స్ తాజాగా మరో డాక్యుమెంటరీని అనౌన్స్ చేసింది. 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించింది.‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్’ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రానుండగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది.
ఇక ఈ ఫస్ట్ లుక్‌లో ఇంద్రాణి ముఖర్జీ పాత్ర కనిపిస్తుండగా.. ఎంతో మిస్టరీగా ఈ పోస్టర్ ఉంది.2015లో షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నతల్లే కూతుర్ని చంపేసిన వైనం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఏప్రిల్, 2012 సంవత్సరంలో 24 ఏళ్ల షీనా బోరాను తల్లి ఇంద్రాణి ముఖర్జీ,ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ మరియు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని కాల్చివేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ గత ఆరున్నర సంవత్సరాలుగా జైలులో ఉండి మే 2022 లో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇంద్రాణి ముఖర్జీ జీవితం ఆధారంగా ఈ డాక్యూమెంటరీ రానున్నట్లు తెలుస్తుంది. ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది.
A sensational scandal that rocked the entire nation, with one family's darkest secrets at the center of it all.#TheIndraniMukerjeaStoryBuriedTruth, coming on 23 February only on Netflix! pic.twitter.com/PIFyDWowIP
— Netflix India (@NetflixIndia) January 29, 2024