Hanuman Shobhayatra : హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలిగూడ నుండి తాడ్ బండ్ వరకు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ శోభాయాత్ర.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగిసింది. ఈ శోభాయాత్ర జరిగిన ప్రాంతం అంతా కాషాయమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలు జరిగాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిపోయింది. దాదాపు 12 కిలోమీటర్లు సాగిన శోభాయాత్రలో హైదరాబాద్ సిటీ పోలీసు తరపున 17 వేల మంది పోలీసులు.. అదనంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆక్టోపాస్ సాయుధ బలగాలతో భారీ బందోబస్తు కల్పించారు.
Read Also : Pune: వీడేం మనిషి.. కుక్కపై అత్యాచారం..
హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ క్షేత్ర స్థాయిలో పర్యటించి బందోబస్తును పరిశీలిస్తూ శోభాయాత్ర ముగిసే వరకు పోలీసులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సిటీలోని 45 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. గతంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులు పర్యవేక్షించారు.