Hanuman Shobhayatra : హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలిగూడ నుండి తాడ్ బండ్ వరకు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ శోభాయాత్ర.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగిసింది. ఈ శోభాయాత్ర జరిగిన ప్రాంతం అంతా కాషాయమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలు జరిగాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిపోయింది. దాదాపు 12 కిలోమీటర్లు సాగిన శోభాయాత్రలో హైదరాబాద్ సిటీ పోలీసు తరపున 17…
దేశరాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ జహంగీర్ పురలో 144 సెక్షన్ అమలులో వుంది. భారీగా రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న హనుమాన్ శోభయాత్రలో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాళ్ళు రువ్విన ఘటనలో పోలీసులతో పాటు పౌరులు…
హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నేతల మధ్య కొనసాగుతోన్న వర్గపోరు బహిర్గతం అయ్యింది.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.. ఈ సందర్‌భంగా బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది.. గత కొద్ది కాలంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీజేపీలో కొనసాగుతున్న వర్గ పోరుకు వేదికగా మారింది హనుమాన్ శోభయాత్ర. నిజామాబాద్ ఎంపీ వచ్చిన తర్వాతే శోభాయాత్రను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ పట్టుబట్టగా… లేదు, షెడ్యూల్ ప్రకారం శోభాయాత్రను…
హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్రకు అంతా రెడీ అయింది. హనుమాన్ జయంతి సందర్భంగా… ఇవాళ హైదరాబాద్‌లో భారీఎత్తున శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామాలయం నుంచి ప్రధాన శోభాయాత్ర ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ తాడ్ బండ్ లో ఉన్న హనుమాన్ ఆలయం దగ్గర శోభాయాత్ర ముగుస్తుంది. మొత్తం 12 కిలోమీటర్లు శోభాయాత్ర సాగనుంది. అలాగే కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మరో శోభాయాత్ర ప్రారంభమై కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ దగ్గర ప్రధాన శోభాయాత్రలో కలవలనుంది..…
హైదరాబాద్‌లోని మందు బాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి… హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్స్, రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్…