తెలుగు ఇండస్ట్రీ లో నటిగా ఎన్నో సినిమాల లో నటించి మెప్పించింది హంసానందిని.స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది..ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈమె భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు..ఇలా క్యాన్సర్ బారిన పడిన ఈమె విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స ను చేయించుకున్నారు.విదేశాలలో క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం తో పూర్తిగా నయం అవడం వల్ల ఈమె తిరిగి ఇండియా కు చేరుకుంది.ఇలా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన ఈమె తిరిగి స్పిరుచ్యూవల్ లుక్ లోకి మారిపోయింది.ఆశ్రమంలో చేరింది.ఆద్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ఇలా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఈమె సోషల్ మీడియా వేదిక గా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.
సద్గురు చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం అంటే మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం. ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది కానీ.. మీరు దానిని గ్రహించలేరు. నాకు నేను ఆశ్రమంలో కి అడుగుపెట్టిన క్షణం లో ఒక అనిర్వచనీయమైన శక్తిని నేను గ్రహించగలిగాను.. అంటూ పోస్ట్ పెట్టింది. ఇలా ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.ఇక ఈమె ఆశ్రమంలోకి వెళ్లి ఈ విధమైన కొటేషన్లను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడంతో బహుశా హంసానందిని ఇకపై ఇలా ఆధ్యాత్మిక చింతనలోనే ఉండిపోతారెమో అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈమె చివరిగా గోపీచంద్ హీరోగా నటించిన పంతం సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు ఆమె సైన్ చేయలేదు.. సుమారు ఏడాది పాటు ఈమె క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయటపడింది హంస నందినీ.హంస నందినీ భవిష్యత్ లో సినిమాలను ఒప్పుకుంటుందో లేదో మరీ చూడాలి.