జూనియర్ ఎన్టీఆర్ మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది శక్తి సినిమా.ఈ సినిమాతో నిర్మాత అశ్వనీదత్ దాదాపు 32 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.శక్తి సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇమేజ్ ను కూడా ఎంతగానో డ్యామేజ్ చేసింది. ఈ సినిమా కథ మరియు కథనంలో జరిగిన పొరపాట్లు వలనే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడానికి కారణమయ్యాయని తెలుస్తుంది .అయితే మెహర్ రమేష్ మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం తయారు చేసిన కథ వేరని అయితే సినిమాగా తీసిన కథ వేరని సమాచారం.. కంత్రీ సినిమా తర్వాత మెహర్ రమేష్ ఎన్టీఆర్ తో మంచి సినిమా తీయాలనుకుని ఎన్టీఆర్, అశ్వినీదత్ లకు కథ వినిపించగా వాళ్లిద్దరికీ ఆ కథ ఎంతగానో నచ్చిందట.
మెహర్ రమేష్ అల్లు అర్జున్ మరియు వినాయక్ లకు కూడా ఈ కథను వినిపించగా వాళ్లకు కూడా బాగా నచ్చింది. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ బృందావనం సినిమాతో బిజీ కావడంతో మెహర్ రమేష్ సినిమా ఆలస్యం అయింది.అయితే ఆ తర్వాత అశ్వినీదత్ ఎన్టీఆర్ తో సోషియో ఫాంటసీ మూవీ తీయాలని భావించి కొంతమంది సీనియర్ రచయితలను కూడా పిలిపించి శక్తి కథలో మార్పులు చేశారనీ సమాచారం.. ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాను తీయాలని నేను అనుకున్నానని కానీ శక్తి లాంటి సినిమాను తీశానని మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. శక్తి సినిమాను 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసాము కానీ దాదాపు 45 కోట్ల రూపాయలు సినిమాకు ఖర్చు అయింది.అధ్యాత్మిక కథల విషయంలో నాకు అంతగా అవగాహన లేకపోవడం శక్తి సినిమాకు బాగా మైనస్ అయిందని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.మెహర్ రమేష్ కు శక్తి సినిమా తరువాత ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈయన చిరంజీవితో తెరకెక్కించిన భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.