Guntur Kaaram Censor Report: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి సినిమాలు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు శ్రీ లీల హీరోయిన్ గా నటించడం, సినిమా నుంచి విడుదలైన ప్రమోషన్ స్టఫ్ కి భిన్న స్పందనలు రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది కానీ పర్మిషన్లు దొరక్క పోవడంతో రేపు గుంటూరులో ఈవెంట్ జరిపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇప్పటికే పూర్తికాగా ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ బయటికి వచ్చింది.
Vijay- Rashmika: విజయ్- రష్మిక ఎంగేజ్ మెంట్.. అసలు నిజం ఇదే.. ?
159 నిమిషాల నిడివిగల ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు, అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఈ సినిమా చూసే అవకాశం కల్పించారన్న మాట. ఇక ఈ సినిమా మొత్తం వీక్షించిన సెన్సార్ సభ్యులు రెండు పదాల విషయంలో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంచత్ అనే పదం వాడటం కరెక్ట్ కాదని ఆ పదాన్ని తొలగించాలని పేర్కొన్నారు. అదే విధంగా భూమిక గురించి ప్రస్తావిస్తూ పీస్ అనే పదం వాడారని ఆ పదం వాడకూడదని పేర్కొన్నారు. అలా ఈ రెండు పదాల విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ సమర్పిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే
Guntur Kaaram Censor