నందమూరి తారక రామారావు.. ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్.’ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో చేయడానికి కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక నిన్న తారక్ బర్త్ డే సందర్భంగా ఈ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి మేకర్స్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇక ఈ రెండు సినిమాలకు తారక్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత కావడం విశేషం. ప్రస్తుతం తారక్ రెండు సినిమా గురించి ఒక గట్టి వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ రెండు సినిమాలకు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోనని చెప్పాడట. అన్న సినిమా కాబట్టి ఇంత త్యాగం చేస్తున్నాడని బయట టాక్ వినిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ కు దాదాపు రూ. 50 కోట్లు వసూలు చేసిన ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత పారితోషికం పెంచాలి కానీ అస్సలు డబ్బు తీసుకోకపోవడమేంటని మరికొందరు అనుమానపడుతున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వెనుకపడి ఉన్నాడన్న విషయం విదితమే. నందమూరి ఆర్ట్స్ పేరుతో నిర్మాణ రంగంలోకి డిగిన నందమూరి వారసుడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతున్నాడు. ఇక దీంతో అన్న ప్రొడక్షన్ స్థాయిని పెంచడం కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్ లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు జోరుగా టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే బిజినెస్ షేర్ కూడా అంత తక్కువేమి కాదు. ఈ సినిమాలు హిట్ అయితే షేర్స్ బాగా వస్తే పర్లేదు, ఒకవేళ సినిమా ఏదైనా తేడా వచ్చిందంటే.. హీరో రెమ్యూనిరేషన్ ఎలాగూ లేదు కాబట్టి కళ్యాణ్ రామ్ నిర్మాతగా సేఫ్ అయ్యినట్లే.. అందుకే ఇలాంటి నిర్ణయం ఎన్టీఆర్ తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.