‘రోబో’ బ్యూటీ అమీ జాక్సన్ తనకు కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఓ బిడ్డకు తల్లి మాత్రం అయ్యింది. ఆమె బ్రిటిష్ కు చెందిన మోడల్ కావడంతో పెళ్ళికి ముందు తల్లి అనే అనే విషయంపై పెద్దగా పట్టింపులు లేవు. అయితే మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయోటౌతో అమీ 2015 నుండి డేటింగ్ చేస్తోంది. జార్జ్ బ్రిటిష్ ప్రాపర్టీ డెవలపర్ ఆండ్రియాస్ పనాయిటౌ, ది ఎబిలిటీ గ్రూప్ వ్యవస్థాపకుడు. హిల్టన్, డబుల్ ట్రీ, పార్క్ ప్లాజా, వంటి పేర్లను కలిగి ఉన్న లగ్జరీ హోటళ్ల యజమాని. పెళ్లి కాకుండానే ప్రెగ్నన్సీ రావడంతో అమీ గర్భవతిగా ఉండగానే 2019లో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.
Read Also : “ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్…!
గతేడాది ఏడాది సెప్టెంబర్‌లో కొడుకుకు జన్మనిచ్చింది. అనంతరం కూడా సంతోషంగా ఉన్న ఈ జంట సడన్ గా విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా అమీ ఇన్స్టాగ్రామ్ ఖాతాని చూపిస్తున్నారు. ఉన్నట్టుండి అమీ ఇన్స్టాగ్రామ్ లో జార్జ్ తో కలిసి ఉన్న పిక్స్ అన్నిటినీ డిలీట్ చేసింది. పెళ్లి కాకముందే తల్లైన ఈ బ్యూటీ అకస్మాత్తుగా కాబోయే భర్తతో విడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా అమీ చివరిసారి ‘రోబో 2.0’ లో సూపర్ స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ లతో కలిసి కనిపించింది.