“ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్…!

దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌలి పీరియాడిక్ యాక్షన్ మూవీ “ఆర్ఆర్ఆర్” పూర్తయ్యే దశలో ఉంది. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ “ఆర్ఆర్ఆర్”. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. “5 భాషలు. 5 ప్రముఖ గాయకులు” అంటూ “ఆర్‌ఆర్‌ఆర్” సాంగ్ 5 భాషల్లో విడుదల కానుండటంతో 5 మంది గాయకులు థీమ్ సాంగ్ కోసం తమ వాయిస్‌ని అందించారని వెల్లడించింది.

Read Also : “ఇష్క్”ట్రైలర్… రన్ టైం ఎంతంటే ?

ఆగష్టు 1న “ఆర్ఆర్ఆర్” నుంచి ఫస్ట్ సాంగ్ రానున్నట్లు ప్రకటించింది. “దోస్తీ” పేరుతో వస్తున్న ఈ సాంగ్ కు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించగా, కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర ఆలపించారు. మిగతా నాలుగు భాషల్లో అనుదీప్‌, అమిత్‌ త్రివేది, విజయ్‌ ఏసుదాసు, నజీర్‌ ఈ సాంగ్ ను పాడారు. కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి “ఫ్రెండ్ షిప్ డే” సందర్భంగా సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు అనే వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయన్నమాట. రాజమౌలి మాగ్నమ్ ఓపస్ “ఆర్‌ఆర్‌ఆర్” అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-