తొలి వలపు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు గోపీచంద్.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో హీరోగా కాకుండా విలన్ గా ‘జయం’ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే చిత్రమని చెప్పొచ్చు. తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జయం నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న విషయం విదితమే.. ఇక తన మొదటి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో నితిన్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. యాదృచ్చికంగా గోపీచంద్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూ లో జయం సినిమా గురించి మాట్లాడాడు.
తన మొదటి పారితోషికం జయం సినిమాకు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. ” నా సంపాదన జయం సినిమాతోనే మొదలయ్యింది. నేను జయం సినిమాకు రూ.11 వేలు పారితోషికం తీసుకున్నాను.. ఆ డబ్బులను మా అమ్మకు ఇచ్చేశాను. అయితే కరెక్ట్ గా రూ.11 వేలు వైనందుకు ఇచ్చారంటే.. తేజగారి లక్కీ నెం. 11.. అందుకే నాకు అంతే ఇచ్చారు. ఇక ఆ తరువాత నేను ఎదిగాకా చాలామంది నా దగ్గర డబ్బు తీసుకున్నారు.. కొంతమంది తిరిగి ఇచ్చారు. మరికొంతమంది ఇవ్వలేదు.. వాళ్ళ పరిస్థితి బాగోలేదోమోనని వదిలేస్తాను కానీ కమర్షియల్ గా ఆలోచించి వారిని వేధించలేదు” అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పక్కా కమర్షియల్ సినిమా జూలై 1 న రిలీజ్ కానుంది. మరి గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న మ్యాచో హీరో ఈ సినిమాతో హిట్ అందుకుంటాడా ..? లేదా అనేది చూడాలి.