తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్దిన వాడు, లెక్కలేనన్ని ప్రయోగాలు చేసిన వాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. అందుకే ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టిన రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కృష్ణ అభిమానులు సంబరాలకి సిద్ధమయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఒకేఒక్క తేడా కృష్ణ లేకపోవడమే. మరణించినా మన మధ్యే ఉండే కృష్ణకి ట్రిబ్యూట్ ఇస్తూ మే 31న ‘భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన మొట్టమొదటి కౌ బాయ్’ సినిమా అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని 4K వెర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, నాగ భూషణం, జ్యోతి లక్ష్మీ లాంటి లెజెండ్స్ నటించిన ఈ మూవీని లెజెండరీ ‘కేఎస్ఆర్ దాస్’ తెరకెక్కించారు.
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు. హాలీవుడ్ లోని “For a Few Dollars More; The Good, the Bad and the Ugly; Mackenna’s Gold లాంటి సినిమాలని చూసి ఇన్స్పైర్ అయ్యి మోసగాళ్లకు మోసగాడు సినిమాని రూపొందించారు. అత్యధిక బడ్జట్ తో రూపొంది 1971లో రిలీజ్ అయిన ఈ సినిమాని అప్పట్లోనే తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం విశేషం. ఈ జనరేషన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే లార్జర్ దెన్ లైఫ్ కథ, కథనం, మేకింగ్ స్టాండర్డ్స్ ఉన్న మోసగాళ్లకు మోసగాడు సినిమాతో కృష్ణని గుర్తు చేసుకుంటూ ఘట్టమనేని అభిమానులు థియేటర్స్ కి వెళ్లనున్నారు.
Let's Relive our Legendary #SuperStarKrishna garu’s birthday with the Magnum Opus on the Big screens🌍
Experience the 4K Restored Version of
𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐅𝐢𝐫𝐬𝐭 𝐄𝐯𝐞𝐫 𝐂𝐨𝐰 𝐁𝐨𝐲 𝐅𝐢𝐥𝐦 #MosagallakuMosagadu 🐎in Theatres WW on May 31st🔥
#MosagallakuMosagadu4K pic.twitter.com/lfra4lWw2d— Viswa CM (@ViswaCM1) March 31, 2023