‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నటీనటులంతా తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లరి నరేష్ తమ ఓట్లను వేశారు. అయితే అందరికీ షాకిస్తూ జెనీలియా కూడా ‘మా’లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చింది. “మా” ఎన్నికలు జరుగుతున్న స్థలానికి వచ్చిన జెనీలియా మంచు విష్ణుతో కలిసి కన్పించింది. వారిద్దరూ కలిసి ఆనందంగా కన్పించారు. ఇదంతా చూస్తుంటే జెనీలియా ఓటు మంచు విష్ణుకే అని అర్థమవుతోంది. వారిద్దరూ కలిసి గతంలో ‘ఢీ’ అనే కామెడీ బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు.
Read Also : ‘మా’ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం
ఇక జెనీలియా ఓటు వేయడానికి రావడం ప్రకాష్ రాజ్ కు షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఓటు వేయడానికి వచ్చే అవకాశం లేదని ఆయన భావించాడు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం అన్నాడు కూడా. కానీ ప్రకాష్ రాజ్ తో పాటు అందరికీ షాకిస్తూ జెనీలియా ఈరోజు ‘మా’ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.