Genelia : జెనీలియా.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే సినిమాలు చేయట్లేదు గానీ.. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో లవ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా అందరితో యాక్ట్ చేసింది. అయితే తన కెరీర్ లో అయిన వాళ్లే తప్పుడు సలహాలు ఇచ్చారని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది. జెనీలియా వెండితెరకు రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి అయిన తర్వాత పదేళ్ల పాటు సినిమాలకు దూరంగానే ఉంది.
Read Also : Janhvi Kapoor : రెచ్చిపోయిన జాన్వీకపూర్.. పిచ్చెక్కించే అందాల ఫోజులు..
అయితే రీ ఎంట్రీ ఇస్తానని చెబితే తనకు దగ్గరి వాళ్లే వద్దని చెప్పారంట. పిల్లలు పుట్టాక సినిమాల్లోకి ఎందుకు అన్నారంట. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తే వర్కౌట్ కాదు వెళ్లొద్దు అని సూచించారంట. కానీ తాను మాత్రం అవేమీ పట్టించుకోకుండా వేద్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్టు జెనీలియా తెలిపింది. వేద్ సినిమాలో తన భర్త రితేశ్ తో కలిసి ఆమె నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. త్వరలోనే ఆమె టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.