సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. గంగూబాయి పాత్రలో అలియా భట్ నటించింది. ఈ ట్రైలర్ బొంబాయి వీధుల్లో గంగూబాయి అధికారంలోకి రావడం గురించి తెలియజేస్తుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎదగడం వరకు చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్‌ను షేర్ చేస్తూ అలియా భట్ “గంగుభాయ్ జిందాబాద్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. #Gangubai Kathiawadi ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వస్తుంది” అంటూ తెలియజేసింది.
Read Also : ప్రముఖ దర్శకుల మధ్య వార్… వరుస ట్వీట్లతో రచ్చ
అలియా భట్‌తో పాటు ట్రైలర్‌లో విజయ్ రాజ్, జిమ్ సర్భ్ కీలక పాత్రలలో కన్పించి ఆశ్చర్యపరిచారు. అజయ్ దేవగన్ రాయల్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్‌లో అజయ్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ఆయన పాత్ర కీలకమని అర్థమవుతోంది. S. హుస్సేన్ జైదీ “మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై” పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. SLB భన్సాలీ ప్రొడక్షన్స్ అండ్ జయంతిలాల్ గడాస్ పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న “గంగూబాయి కతియావాడి” ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.