Ganesh Anthem Promo from Bhagavanth Kesari Released: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీ లీల నటిస్తుందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక అక్టోబర్లో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి గణేష్ యాంథమ్ అనే సాంగ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన పూర్తి లిరికల్ వీడియో రిలీజ్ చేస్తామని చెబుతూ ప్రస్తుతం నిమిషం నిడివి గల ప్రోమో రిలీజ్ చేశారు.
Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ కి హైకోర్టు నోటీసులు
అందులో నందమూరి బాలకృష్ణ స్టెప్ వేసేందుకు సిద్ధమవుతూ అసలు బీటు ఏ మాత్రం సరిపోలేదని అక్కడే ఉన్న శ్రీ లీలకు చెప్పడంతో ఆమె బీటు మార్చండి మా చిచ్చాకి ఏమాత్రం ఆనడం లేదు, చిచ్చా వచ్చిండు.. ఇగ కొట్టర కొట్టు సౌమారు అని చెప్పడం కనిపిస్తోంది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఈసారి రాబోతున్న వినాయక చవితికి అన్ని నవరాత్రులు పందిళ్ళలో రిపీట్ మోడ్లో వినిపించే సాంగ్ అవబోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి.