Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేశాడు. దీంతో అజయ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో మొదటి వరసలో ఉంటాడు అని అనుకున్నారు. కానీ, అంచనాలను తారుమారు చేస్తూ మహాసముద్రం సినిమా డిజాస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత అజయ్ భూపతి సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. దీంతో మనోడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ, బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అజయ్.. మరో కొత్త మూవీతో ఎంటర్ అయ్యాడు. అదే మంగళవారం. టైటిల్ కొంచెం కొత్తగా ఉంది కదా.. కథ కూడా కొత్తగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఆర్ఎక్స్ 100 లో ఇందుగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. గణగణ మోగాలిరా అంటూ సాగే ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూజకి సిద్ధమవ్వండి.. పూనకాలు మొదలవ్వనున్నాయ్ అంటూ ఈ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ను ఆగస్టు 16 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మా లచ్చమ్మ జాతరలో పూజలు చేస్తూ ప్రజలు కనిపించారు. ఇక ఈ సినిమాకు కాంతార కు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాధ్ మ్యూజిక్ అందించడం విశేషం. పాన్ ఇండియా సినిమాగా త్వరలోనే మంగళవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆర్ఎక్స్ 100 తో హిట్ అందుకున్న అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.