Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చరణ్ డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. తండ్రీకొడుకులుగా చరణ్ కనిపించనున్నాడు. తండ్రి సర్పంచ్ కాగా.. కొడుకు ఎన్నికల అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ వచ్చింది. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.
వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై నిర్మాత దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చాడు. నిన్న సలార్ సినిమా చూడడానికి బయటకొచ్చిన దిల్ రాజును ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ అడుగగా.. గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.