ఒక చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటే సంగీతం, పాటలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ విషయంలో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. అయితే సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గలేదు అన్పిస్తోంది తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే !
Read Also : Mahesh Babu : ప్యారిస్ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అన్ని వర్గాల ప్రేక్షకులు ‘పుష్ప’రాజ్ మ్యాజిక్ లో పడిపోయేలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పాలి. ‘శ్రీవల్లి’ పాటలోని హుక్ స్టెప్‌తో యూట్యూబ్ లో కొంతమంది రచ్చ చేయగా, ఇన్‌స్టా రీల్ షార్ట్ చేయడానికి మరికొందరు ప్రయత్నించారు. అయితే తాజాగా ఓ ఫారిన్ అమ్మాయి ‘శ్రీవల్లి’ పాటకు సంబంధించిన మ్యూజిక్ ను వయోలిన్ మీద వాయించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. యూట్యూబ్‌లో 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న 13 ఏళ్ల వయోలిన్ విద్వాంసురాలు కరోలినా ప్రొట్సెంకో ‘శ్రీవల్లి’ పాట వయోలిన్ వెర్షన్‌ను పోస్ట్ చేసి అల్లు అర్జున్ అభిమానులను, పుష్ప ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్న ఈ యువతి ‘శ్రీవల్లి’ పాటను ప్లే చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.