Fish Venkat : సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే కోట శ్రీనివాసరావు, నటి సరోజ దేవి, తర్వాత రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృత్యువాత పడ్డారు. ఈ విషాద వార్తలు మరువకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్‌లో ఎక్కువ కనిపించారు.
ATM Robbery : సినిమా స్టైల్‌లో ఏటీఎం లూటీ
సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీ చేయడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం ఫిష్ వెంకట్ వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కోసం కుటుంబ సభ్యులు తీవ్రముగా కృషి చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండడంతో సినీ పరిశ్రమలో కొంతమంది ముందుకు వచ్చి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు రాత్రి 9:45 నిమిషాలకు చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.
Hyderabad Rains : హోండా షోరూంలోకి వరదనీరు.. చిక్కుకున్న 80 మంది సిబ్బంది