ATM Robbery : జులాయి సినిమాలో దుండగులు బ్యాంకు దోచిన తరహాలోనే కొంత మంది స్కెచ్చేశారు. కాకపోతే బ్యాంకు కాకుండా ఏటీఎం లూటీకి ప్లాన్ చేశారు. అచ్చం సినిమాల్లో చూపించిన విధంగా ఏటీఎం చోరీ కోసం గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలు అన్నీ తెచ్చుకున్నారు. దర్జాగా ఏటీఎంలోని డబ్బులు ఎత్తుకెళ్లారు. కానీ సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
వాయిస్: హైదరాబాద్‌లో వరుసగా ఏటీఏం చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే మైలార్‌దేవ్‌పల్లి లోని ఓ ఏటీఎం సెంటర్, రెండు నెలల క్రితం రావిర్యాలలో, మొన్న చౌటుప్పల్.. ఇప్పుడు జీడిమెట్ల ఇలా ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ సరైన భద్రత లేని ఏటీఎం సెంటర్లనే లక్ష్యంగా చేసుకుని పంజా విసురుతున్నారు అంతరాష్ట్ర దొంగల ముఠాలు…
ఈ నెల 8న ఓ అంతరాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. జీడిమెట్ల గాజులరామారం మార్కండేయ నగర్‌లో ఉన్న HDFC ఏటీఎం సెంటర్లో ప్రవేశించారు. అలా ఇలా కాదు.. ఫుల్ సెటప్‌తో వచ్చారు. గ్యాస్ కట్టర్ వెంట తెచ్చుకున్నారు. ఇంకేముంది ఏటీఎం సెంటర్లోకి ఎంటర్ కాగానే పని మొదలు పెట్టేశారు. గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. అందులో ఉన్న 34 లక్షల రూపాయలు చోరీ చేసుకుని తీసుకెళ్లారు. ఈ విజువల్స్ అన్నీ ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి…
Live-In Relationships: సహజీవనం.. నలుగురి ప్రాణాలు బలి..!
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 10 రోజుల పాటు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను బేస్ చేసుకుని కేస్ ఛేదించారు. నిందితులందరినీ హరియాణ రాష్ట్రం మేవాట్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిలో యాసిబ్ హుస్సేన్ కింగ్ పిన్‌గా ఉన్నాడు. అతనితోపాటు అమీర్ అన్సారీ, ఎండీ ఆబిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలోని ఓ పీజీ హాస్టల్ వెనుక భాగంలో వీరు షెల్టర్ తీసుకున్నట్లుగా గుర్తించారు. ఏటీఎం చోరీ కోసం.. బేగంపేట ప్రకాశ్ నగర్‌లో గ్యాస్ కట్టర్, సిలిండర్ కొనుగోలు చేసినట్లు సమాచారం…
మరోవైపు ఈ కేసులో నిందితుడు అమీర్ అన్సారి.. శివపురి సెంట్రల్ జైల్‌లో POCSO కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవించాడు. జైల్‌లో మిగతా హర్యానా మేవాట్‌కు చెందిన ఇద్దరితో పరిచయం అయింది. దీంతో బయటకి వచ్చాక హైదరాబాద్‌లో కలిసి ఏటీఎం సెంటర్లో చోరీకి తెగబడ్డారు…
ఏటీఎంలు మాత్రమే కాదు.. ఇళ్లల్లోనూ ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలు దొంగతనాలు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి హైదరాబాద్ లో జనం అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Adulterated Liquor : కల్తీ కల్లు ప్యాకెట్లలో విక్రయం.. ఎక్సైజ్ దాడులు!