సమంత ఐటమ్ సాంగ్ చేస్తే!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత ఐటమ్ సాంగ్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఏ కొత్త సినిమా సైన్ చేయని సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని అటు ‘పుష్ప’ యూనిట్ కాని ఇటు సమంత కానీ ధృవీకరించలేదు. అయితే ఈ నెల 28 నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని, దీనికోసం భారీ సెట్ ను రూపొందిస్తున్నారని, ఈ పాట కోసం సమంత కోటిన్నర వరకూ వసూలు చేస్తుందని ఇలా పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే సమంత ఐటమ్ సాంగ్ విషయంలో పాజిటీవ్, నెగెటీవ్ రియాక్షన్స్ వెలువడుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలో పారితోషికం ముఖ్యం కాదు… సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ ఉన్న సినిమాలనే చేస్తానన్న సమంత ఇప్పుడు కేవలం టెంప్టింగ్ రెమ్యూనరేషన్ కోసమే ఐటెం నంబర్‌కి అంగీకరించటం సబబు కాదని కొందరు వ్యాఖ్యానిస్తుంటే… తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవటానికి, ఎలాంటి పాత్రలనైనా చేయగలను అని నిరూపించుకోవటానికి ఈ ఐటమ్ నెంబర్ పనికి వస్తుందని మరి కొందరంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం. సమంత ఏ పాత్రలోనైనా ఇమిడిపోగల నికార్సైన నటి. ఇప్పుడు ఆమె కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
అయితే ‘జాను’ వంటి డిజాస్టర్ తర్వాత, విడాకులు వంటి సెన్సేషన్ న్యూస్ తర్వాత మళ్ళీ ఓ సక్సెస్ తో కెరీర్ లో సెలబ్రేషన్ చేసుకోవలసిన అవసరం మాత్రం ఉంది. దానికి గుణశేఖర్ ‘శాకుంతలం’ తప్పక ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ సినిమా రావటానికి టైమ్ పడుతుంది కనుక సమంత ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒప్పుకుని ఉండవచ్చు. దానిని తనని తప్పు పట్టవలసిన అవసరం లేదు. అక్కినేని కుంటుంబ మాజీ కోడలు కాబట్టి ఐటమ్ సాంగ్ చేయటం అనే ఓ చిన్న సందేహం ప్రేక్షకులలో ఉండవచ్చు. అయితే సుకుమార్ దర్శకుడు కావటం, మరోస్టార్ ఫ్యామిలీకి చెందిన బన్నీ హీరో కావటం, దేవిశ్రీ ప్రసాద్ వంటి ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ సంగీత దర్శకుడు కావటంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రస్తుతం చెన్నైలో ఉన్న సమంత రెండు రోజుల ముందుగా హైదరాబాద్ వచ్చి ఈ పాట ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనబోతోందట. సమంత నిజంగా ఈ ఐటమ్ సాంగ్ చేస్తే బన్నీ అభిమానులకు మాత్రం పండగే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాలుగు పాటలు యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. డిసెంబర్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ ‘పుష్ప’లో సమంత చేయబోయే డాన్స్ నెంబర్ ఆ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సిందే.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!