Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక ఈ సినిమా మీదే ఫుల్ ఫోకస్ చేసిన బన్నీ.. ఎలాగైనా ఈ సినిమాను కూడా పుష్ప లెవల్లో తీసుకురావడానికి కష్టపడుతున్నాడు. ఇక సినిమాలు గురించి పక్కన పెడితే.. అల్లు అర్జున్ ను సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తో పాటు బన్నీని ట్రోల్ చేసేవారు కూడా చాలా ఎక్కువమందే ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ తో ఈ ట్రోల్స్ మొదలయ్యాయి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేరే వాళ్ల హీరోల ఫంక్షన్స్ లో మెగా హీరోల గోల ఏంటి అని బన్నీ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఏ ఈవెంట్ కు బన్నీ వచ్చినా ట్రోలింగ్ ఫీడ్ ఇస్తాడని ట్రోలర్స్ ఎదురుచూస్తూ ఉంటారు.
ఇక తాజాగా ఒక చిన్న ఘటన బన్నీని మళ్లీ అడ్డంగా బుక్ చేసింది. అదేంటంటే.. అల్లు శిరీష్ నటించిన ఉర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మీట్ కు బన్నీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో స్పీచ్ అంతా బాగా చెప్పాడు. చివర్లో స్టేజిపైకి ఒక అభిమాని వచ్చి బన్నీ కాళ్ల మీద పడి ఫోటో తీసుకోవడానికి వచ్చాడు. అది చూసిన బన్నీ “ప్రతి ఈవెంట్ లోనూ ఇలాంటివాడు ఒకడు ఉంటాడు” అని నవ్వేశాడు. ఇక ఈ ఒక్కమాట ట్రోలర్స్ కు ట్రోల్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. అభిమానులు అంత కష్టపడి తన అభిమాన హీరోను కలవడానికి వస్తే అంత ఈజీగా తీసుకొని వారిని ఎగతాళి చేసి మాట్లాడడం ఏంటి..? అని కొందరు. కిందనున్న వాళ్లు కావాలనే అతడిని పంపించారు.. కావాలంటే చూడండి.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చినా ఒక్కరిలోనూ రియాక్షన్ లేదు.. ముందే వస్తాడని అందరికి తెలుసు అని అనిపిస్తోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఒక్క విషయంలో మరోసారి అల్లు అర్జున్ ట్రోలర్స్ కు బుక్కయ్యాడని అంటున్నారు.