Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్- సంగీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ కు సంగీత వీరాభిమాని. అతనినే ఏరికోరి పెళ్లాడడానికి ఆమె చాలానే కష్టాలు పడింది. ఇప్పుడు సంగీత తమ 22 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకనుందా..?. అసలు ఈ వార్తలు రావడానికి కారణం ఏంటంటే.. ఆమె వరిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడం, ఆ మధ్య దర్శకుడు అట్లీ ఇంట్లో ఫంక్షన్ కి విజయ్ ఒంటరిగా వెళ్లడం, గత కొన్ని రోజులుగా ఆమె ఎక్కడా విజయ్ తో పాటు కనిపించకపోవడంతో విజయ్ కు, సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకొస్తున్నారు.
Read Also: Varasudu: ఏం గురూ.. గౌతమ్ SSC ని తిప్పి తిప్పి చూపిస్తే గుర్తుపట్టలేమా..?
ఇక ఈ వార్తలను విజయ్ సన్నహితులు ఖండించారు. విజయ్- సంగీత విడిపోలేదని, ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సంగీత పిల్లలతో కలిసి అమెరికాలో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారట. అందుకే విజయ్ ఒక్కడే ప్రతి ఫంక్షన్ ను వెళ్తున్నాడని, త్వరలోనే ఆమె అమెరికా నుంచి రానున్నట్లు కూడా తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మకండి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్తలకు చెక్ పడిందనే చెప్పాలి. ఇక విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. జనవరి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.