హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్‌ను కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ శుద్ద్ దేశీ రొమాన్స్ తో బీటౌన్ తెరంగేట్రం చేసిన వాణి బేఫికర్, వార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది ముంబయిగా మారింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంత కాలం మిగల్లేదు వాణికి. ఆ తర్వాత నుండి వరుస ప్లాపులు పలకరించడతో కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే
బెల్ బాటమ్, చండీగర్ కరే ఆషికి, షంషేరా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మేడమ్ కెరీరే డైలామాలో పడిపోయింది. దీంతో మెల్లిగా స్టార్ హీరోలు ఆమెను సైడ్ చేసేశారు. ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోలతో జోడీకడుతోంది. చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నా అందులో రైడ్ 2 ఒక్కటే చెప్పుకోదగ్గ మూవీ. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. రైడ్‌లో హీరోయిన్ ఇలియానా డిసౌజా కాగా ఆమె ప్లేసులోకి వాణి రీప్లేస్ అయినట్లు తెలుస్తోంది. 2018లో హిట్ బొమ్మగా నిలిచిన రైడ్ సీక్వెల్ మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రితేశ్ దేశ్ ముఖ్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. టీసిరీస్, పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రైడ్ 2 కాకుండా వాణి చేతిలో మరో మూడు ప్రాజెక్టులున్నాయి. బ్యాటమీజ్ గిల్, అబీర్ గులాల్, సర్వగుణ్ సంపన్ చిత్రాలు చేస్తోంది. ఇవన్నీ ప్రజెంట్ షూటింగ్ కంప్లీటయ్యాయి. కానీ బజ్ క్రియేట్ చేసేంత సీన్ ఆ సినిమాలకు లేదు. డైలమాలో పడిపోతున్న వాణి కపూర్ కెరీర్‌కు రైడ్ 2 హిట్ కావడం చాలా కీలకం. మరీ అజయ్ దేవగన్ ఆమె ఫేట్ మారుస్తాడో లేదో.