కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసదా హిట్లతో మ్యాచ్న్హి ఫార్మ్ ఓ ఉన్నాడు. ఇటీవలే జై భీమ్ తో భారీ విజయాన్ని అందుకున్న సూర్య ప్రస్తుతం ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.
అల్లరి చిల్లర గా తిరిగే ఒక యువకుడు.. మహిళలపై జరుగుతున్న దాడులను, దారుణాలను, అన్యాయాలను ఆపడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు చూపించారు. ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు అని చూపించాలి అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక సూర్య నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు.. ఎప్పటిలాగే సూర్య తన నటనతో ఇరగదీశాడు. సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా మార్చి 10 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సూర్య మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.