Eesha Rebba steps out from item song in Gangs of Godavari: అచ్చు తెలుగు తెలంగాణ అమ్మాయి ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఇక ఆ తరువాత ఒక తమిళ, ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది. అయితే ఆమె ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోవాలన్న ఆమె ఆశలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ ఆఫర్ రావడంతో అది చేయడానికి కూడా వెనకాడ లేదు.
Brahmanandam: చిరు అవతారం చూసి నవ్విన బ్రహ్మీ.. సెట్ లోనే అందరిముందు అరిచిన మెగాస్టార్
కానీ అక్కడ కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. అసలు విషయం ఏమిటంటే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఈషా రెబ్బా ఒక స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన షూటింగ్ కి కూడా ఆమె హాజరైంది. అయితే ఒకరోజు షూటింగ్లో పాల్గొన్న తర్వాత ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె సాంగ్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో హిందీ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ ఈషా రెబ్బా స్థానంలో స్పెషల్ సాంగ్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. వీలైనంత త్వరలో సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.