Ee Nagaraniki Emaindi Collections: ఈ మధ్య కాలంలో మొదలైన టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించట్లేదు. నిన్నమొన్నటి దాకా స్టార్ హీరోల సినిమాలు ఆయన పుట్టిన రోజు అనో లేక సినిమా రిలీజ్ అయి పదేళ్ళు పూర్తి చేసుకుందనో రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టగా ఇప్పుడు చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయ్యి అయిదేళ్ళు పూర్తయిన క్రమంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా రీరిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ రాబట్టి అందరిని షాక్ కి గురి చేసింది. రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో జోరు చూపించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోయింది.
Polimera 2 Teaser: పొలిమేర టీజర్.. చేతబడితోనే ప్యాంట్ తడిచేలా భయపెట్టేస్తున్నారు కదయ్యా
మొదట సారి రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టింది ఈ నగరానికి ఏమైంది సినిమా. ఈ నగరానికి ఏమైంది జూన్ 29న రీరిలీజ్ చేయగా అదే రోజున రిలీజ్ అయిన స్పై, సామజవరగమనా లాంటి సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటిదాకా రీరిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయంటే, వాళ్లకున్న క్రేజ్ కారణం అని అనుకోవచ్చు కానీ, స్టార్స్ లేని ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా రీరిలీజ్ కి కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే అది కంటెంట్ పవర్ అని చెప్పచ్చని అంటున్నారు.