సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ పోటాపోటీగా దిగి టాలీవుడ్‌కు అసలు సిసలైన బాక్సాఫీస్ ఫీస్ట్ అందించారు. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, సందీప్ కిషన్లు మాత్రమే హాయ్ చెప్పారు. బాక్సాఫీస్ దగ్గర కాస్త ఎంటర్మైనెంట్ మిస్సయ్యామని ఫీల్ అవుతుంటే ఆ లోటు లేకుండా చేశాయి డబ్బింగ్ చిత్రాలు. అజిత్ పట్టుదల, ధనుష్ డైరోక్టోరియల్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా, ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఆది శబ్దం, జీవా అగత్యా చిత్రాలు ఫిబ్రవరి నెలలో టాలీవుడ్‌లో సందడి చేశాయి.
Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే .?
డబ్ చేసినందుకు మార్కెట్ చేసుకున్నామా లేదా అని పక్కన పెడితే ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ ఆఫ్ ది పరిశ్రమగా మారుతోన్న టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేశామా లేదా అన్నదే చూస్తున్నాయి. నాట్ ఓన్లీ తమిళ పరిశ్రమ మెయిన్ స్ట్రీమ్ సినీ ఇండస్ట్రీస్ తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు రాబోయే మార్చి ఫస్ట్ వీక్‌పై ఫోకస్ చేస్తున్నాయి నాలుగు ఇండస్ట్రీలు. ముందుగా బాలీవుడ్ థియేటర్లను షేక్ చేస్తోన్న విక్కీ కౌశల్ ఛావా మార్చి 7న రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్. అలాగే మాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోన్న కుంచకో బోబన్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే రోజు డ్యూటీ ఎక్కుతోంది. తమిళ్ నుండి జీవీ ప్రకాష్ 25వ సినిమా కింగ్ స్టన్ తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక శాండిల్ వుడ్ నుండి ప్రజ్వల్ దేవరాజ్ ‘రాక్షస’ పేరుతో రాబోతున్నాడు. ఇలా టాలీవుడ్ బాక్సాఫీసును టార్గెట్ చేస్తోన్న ఈ నాలుగు డబ్బింగ్ సినిమాల్లో ఏ సినిమా టాలీవుడ్ లో భారీ వసూళ్లు రాబడుతుందో చూడాలి.