బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. రీమేక్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎనిమిదో రోజు కూడా 7 కోట్లు రాబట్టిన దృశ్యం 2 సినిమా బాక్సాఫీస్ జోష్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. దృశ్యం 2 సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకునే లోపు 200 మార్క్ ని టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడున్న బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తుంటే ట్రేడ్ వర్గాల అంచనాలు నిజమయ్యే సూచనలు ఉన్నాయి.
దృశ్యం 2 సినిమా నార్త్ లో రాబడుతున్న కలెక్షన్స్ ని చూస్తుంటే, వెంకటేష్ మోహన్ లాల్ తప్పు చేశారేమో అనిపించకమానదు. తెలుగు మలయాళ భాషల్లో రూపొందిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఒటీటీకే పరిమితం అయ్యాయి కానీ మేకర్స్ వాటిని థియేటర్స్ వరకూ తీసుకోని వెళ్లలేదు. ఒకవేళ వెంకటేష్ కానీ మోహన్ లాల్ కానీ థియేటర్స్ లో తమ సినిమాలని రిలీజ్ చేసి ఉంటే సౌత్ లో కూడా దృశ్యం సీరీస్ మంచి కలెక్షన్స్ ని రాబట్టి ఉండేది. మేకర్స్ అలా చేయకపోవడం కారణంగా మంచి బాక్సాఫీస్ సత్తా ఉన్న సినిమా ఒటీటీ హిట్ అనే మాట వరకే ఆగి పోవాల్సి వచ్చింది.