NTR30: NTR30 నుంచి డబుల్ ధమాకా.. అదొక్కటే ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Updates From NTR30 Project: జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. NTR30 ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే ఆ శుభ ఘడియలు వచ్చేశాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. మార్చి 18వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కి కొందరు ప్రత్యేక అతిథులు హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి 30వ తేదీ నుంచి స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఆస్కార్ ఈవెంట్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో అమెరికాలో ఉన్న తారక్.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి తిరిగి రాగానే NTR30 సినిమా పనుల్ని షెడ్యూల్ ప్రకారం మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో.. గ్యాప్ ఇవ్వకుండా శరవేగంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 05వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే!
Jr NTR: ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా రూపొందుతుండడంతో.. ఈ NTR30 ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి.. దీనిని మొదట్లో రీజనల్ మూవీగా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్తో తారక్‌కి వచ్చిన భారీ క్రేజ్ నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యారు. అందుకే.. ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్, ఇంతకాలం ఆలస్యం అయ్యింది. ఇక ఇందులో తారక్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆ అమ్మడి పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం అధికారికంగా తమ సినిమాలో జాన్వీ కథానాయికగా నటిస్తోందంటూ పోస్టర్ లుక్‌తో ప్రకటించారు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నారని సమాచారం.
Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!