Disha Patani: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు వినగానే హాట్ హాట్ ఫోటో షూట్లు గుర్తొస్తాయి. తెలుగులో లోఫర్ సినిమాతో ఏంటి ఇచ్చి కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో కీలక ప్రెత్రలో నటిస్తోంది. ఇక దిశా సోషల్ మీడియాలో సెగలు రేపడం గురుంచి అందరికి తెల్సిందే. చిట్టి పొట్టి డ్రెస్ లో ముద్దుగుమ్మ హొయలు పోతూ కవ్విస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య దిశాపై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది. దానికి కారణం ఆమె ముఖానికి సర్జరీ చేయించుకోవడమే.. గత కొన్ని రోజుల క్రితం దిశా ముఖానికి సర్జరీ చేయించుకుందని, అప్పటినుంచి ఆమె పేస్ మారిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి.
పెదాలను పెద్దగా మార్చుకోవడమే కాకుండా ముక్కు కూడా కొంచెం పెంచుకున్నట్లు చెప్తున్నారు. దీనివలన దిశా ఫేస్ బార్బీ బొమ్మను గుర్తుచేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. లోఫర్ సమయంలోనే ఆమె ఎంతో బావుందని, ఇప్పుడు అస్సలు బాలేదని చెప్పుకొస్తున్నారు ఇక తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలో అచ్చు రబ్బరు బొమ్మలానే ఉందని, ముఖంలో కళా కాంతి లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపొతే ప్రస్తుతం దిశా ఏక్ విలన్ రిటర్న్స్ లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో దిశా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనో చూడాలి.