స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్, నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ప్రేమ కావాలి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్. క్లాసిక్ సినిమాలు ఇచ్చిన ఈ దర్శకుడికి, త్రివిక్రమ్ మాటలు కూడా కలిస్తే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. త్రివిక్రమ్ పక్కకి వచ్చిన తర్వాత విజయ్ భాస్కర్ సినిమాలు పూర్తిగా తగ్గించేసాడు. ఆ తర్వాత సోలో డైరెక్టర్ గా త్రివిక్రమ్ సొంతగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, విజయ్ భాస్కర్ మాత్రం లైమ్ లైట్ నుంచి దూరమయ్యాడు. చివరగా 2013లో మసాలా సినిమాతో దర్శకుడిగా ఆడియన్స్ ముందుకి వచ్చిన విజయ్ భాస్కర్… ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకున్న విజయ్ భాస్కర్ తాజాగా మరో లవ్ ఫ్యామిలీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు.
Read Also: Pushpa 2: బన్నీకే కష్టమా? అయితే పూనకాలే మావా!
‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ.
Read Also: Ram Charan: ఆదికేశవ ట్రైలర్ కి చరణ్ సూపర్ రెస్పాన్స్…